ప్రభుత్వాస్పత్రిలో ఆయుధ పూజ
సిద్దిపేటకమాన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో దసరా పండుగను పురస్కరించుకుని వైద్యులు, సిబ్బంది మంగళవారం ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, పిడియాట్రిక్ విభాగ హెచ్‌ఓడీ డాక్టర్ సురేష్‌బాబు వైద్యులు, సిబ్బందితో పాటు ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అనస్తీషియా విభాగ హెచ్‌ఓడీ చందర్, వైద్యులు రాగిణి, రమ్య, రవి, గ్రీష్మ, సునీత, మహేందర్, సౌజన్య, ప్రవీణ్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.


