దంపతుల మధ్య గొడవ.. | - | Sakshi
Sakshi News home page

దంపతుల మధ్య గొడవ..

Oct 5 2025 8:56 AM | Updated on Oct 5 2025 8:58 AM

భార్య అదృశ్యం

కౌడిపల్లి(నర్సాపూర్‌): మహిళ అదృశ్యమైంది. ఎస్‌ఐ మురళి వివరాల ప్రకారం... మండలంలోని భుజిరంపేట గ్రామానికి చెందిన సంది కృష్ణ, పుష్పలత భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా ఈనెల 3న భార్య పుట్టింటికి వెళతానని భర్తకు చెప్పడంతో అన్న ఇంట్లో ఫంక్షన్‌ ఉంది వద్దన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా భార్యపై చేయిచేసుకున్నాడు. అనంతరం భర్త పొలం వద్దకు వెళ్లాడు. తరువాత భర్త ముగ్గురు కూతుళ్లను తీసుకుని కౌడిపల్లికి వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళ్లేసరికి పుష్పలత ఇంట్లోలేదు. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో..

పటాన్‌చెరు టౌన్‌: ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీకి చెందిన సోనియా వాస్వాని (22) గేటెడ్‌ కమ్యూనిటీ మల్లంపేటలో సెక్యూరిటీ స్టాఫ్‌గా పనిచేస్తుంది.ఈ క్రమంలో 2వ తేదీన తల్లి ఆశ పండుగ నేపథ్యంలో తన సోదరి ఇంటికి వెళ్లింది. తిరిగి 3వ తేదీన ఇంటికి వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. దీంతో స్థానికంగా, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

రేగోడ్‌లో విద్యార్థిని..

రేగోడ్‌(మెదక్‌): విద్యార్థిని అదృశ్యమైన ఘటన మండలంలోని మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పోచయ్య కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కమ్మరి జగదీశ్వరి (18) శుక్రవారం ఉదయం రేగోడ్‌లోని మీసేవ కేంద్రానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టు పక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నర్సాపూర్‌లో మహిళ ..

నర్సాపూర్‌ రూరల్‌: మహిళ అదృశ్యమైన ఘటన మండలంలోని గూడెంగడ్డలో జరిగింది. ఎస్సై రంజిత్‌ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అవంచ దుర్గయ్య, భార్య జ్యోతి (34) దంపతులు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం దుర్గయ్య తన పొలంలో పండించిన కూరగాయలను నర్సాపూర్‌లో అమ్మడానికి వచ్చాడు. భర్త ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి తాను కూడా కూరగాయలు అమ్మడానికి నాన్న వద్దకు వెళ్తున్నానని కొడుకుకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల వద్ద ఆరా తీసిన ఫలితం లేదు.

ఝరాసంగంలో యువతి..

జహీరాబాద్‌ టౌన్‌: యువతి అదృశ్యమైంది. రూరల్‌ ఎస్‌ఐ.కాశీనాథ్‌ వివరాల ప్రకారం... ఝరాసంగం మండలంలోని పొట్‌పల్లి గ్రామానికి చెందిన బూచన్‌పల్లి సామేల్‌ కూతురు పావని(19) సెప్టెంబర్‌ 29న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పలు చోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 దంపతుల మధ్య గొడవ..1
1/2

దంపతుల మధ్య గొడవ..

 దంపతుల మధ్య గొడవ..2
2/2

దంపతుల మధ్య గొడవ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement