దాడి కేసులో నలుగురిపై కేసు | - | Sakshi
Sakshi News home page

దాడి కేసులో నలుగురిపై కేసు

Oct 4 2025 6:18 AM | Updated on Oct 4 2025 6:18 AM

దాడి

దాడి కేసులో నలుగురిపై కేసు

పటాన్‌చెరు టౌన్‌: దాడికి పాల్పడిన పలువురిపై కేసు నమోదు చేసిన సంఘటన బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్నాపూర్‌ ఇంద్రమ్మ కాలనీకి చెందిన కిరణ్‌ అతడి స్నేహితుడు విష్ణు ఇరువురు కలిసి పాశమైలారంలో దసరా ఉత్సవాలు చూడటానికి వెళ్లారు. అయితే అక్కడ సాయిసాగర్‌ ఫుడ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీకి చెందిన నలుగురు వ్యక్తులు కలిసి గొడవ పడుతుండడంతో వారిని ఆపేందుకు విష్ణు అతడి స్నేహితుడు కిరణ్‌ లు వెళ్లగా వారిపై కట్టెలతో దాడి చేశారు. అదేవిధంగా బైక్‌ను ధ్వంసం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ మండలంలోని రాష్ట్ర సరిహద్దులో చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి ఎకై ్సజ్‌ శాఖ అధికారులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. వాహనాల తనిఖీలో భాగంగా గోవా నుంచి వస్తున్న ట్రావెల్‌ బస్సును తనిఖీ చేయగా 195 నైట్రోజెఫమ్‌ (డ్రగ్స్‌) టాబ్లెట్ల బాక్సులు దొరికాయి. సుమారు 46 కిలోలు ఉన్న డ్రగ్స్‌ విలువ రూ.73,12,500 ఉంటుంది. కర్నాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన ఓ వ్యక్తి బస్సు డ్రైవర్‌కు ఈ బాక్స్‌లను అప్పగించి హైదరాబాద్‌లో తీసుకొంటానని చెప్పాడు. డ్రగ్స్‌తో పాటు బస్సును సీజ్‌ చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశామని, గుల్బర్గా వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని రహదారిపై డ్రగ్స్‌ రవాణాను అరికట్టడానికి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

8న గిరిజనుల సమ్మేళనం

హుస్నాబాద్‌: లంబాడీల హక్కులను కాపాడు కోవడానికి భవిష్యత్‌ కార్యచరణలో భాగంగా 8న హుస్నాబాద్‌లో గిరిజనుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు బానోతు కిషన్‌ నాయక్‌ చెప్పారు. శుక్రవారం నియోజకవర్గ లంబాడీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడానికి కొంతమంది ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ కుట్రలను తిప్పి కొట్టడానికి పార్టీలకు అతీతంగా లంబాడీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భిక్షపతి, రవి, శంకర్‌ నాయక్‌, శ్రీనివాస్‌ నాయక్‌, రాజు నాయక్‌, తిరుపతి నాయక్‌, కృష్ణ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

దాడి కేసులో నలుగురిపై కేసు
1
1/1

దాడి కేసులో నలుగురిపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement