ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మణికొండ: జీవనోపాధికి ఆటోలను నడుపుతున్న వారిలో కొందరు ఇష్టానుసారంగా నడపటం, ఎక్కడ పడితే అక్కడ ఆపటం, ప్రయాణికుల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవటంతో అందరికీ చెడ్డపేరు వస్తుందని మాదాపూర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నార్సింగిలోని కేవీఎంఆర్ ఫంక్షన్‌హాల్లో మంగళవారం ఆటో డ్రైవర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పని సరిగా పాటించాలన్నారు. రోడ్లపై వేగంగా నడపరాదని ఆటో డ్రైవర్లు తమ వద్ద ఆర్సీ, ఇన్సూరెన్స్ లైసెన్సు ఎల్లప్పుడు ఉంచుకుని డ్రస్సులను ధరించే ఆటోలు నడపాలన్నారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించినా నియమాలను పాటించకపోయినా చర్యలు తప్పవన్నారు. నార్సింగి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, అదనపు ఇన్‌స్పెక్టర్ ప్రదీప్, ఎస్సై రాజేశ్‌గౌడ్ పాల్గొన్నారు.


