ప్రభుత్వ భూములు కాపాడండి
చేవెళ్ల: పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం డిమాండ్ చేశారు. మండల పరిధిలోని న్యాలట గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. న్యాలట రెవెన్యూలోని సర్వే నెంబర్ 240లోని ప్రభుత్వ భూములను, పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను కొందరు కబ్జాదారులు, రాజకీయ నాయకులు కబ్జా చేసి విక్రయాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించి కబ్జాకు గురువుతున్న భూములను కాపాడాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు మక్బూల్, సుధాకర్‌గౌడ్, శివ, కిష్టయ్య, అంజయ్య, సుదర్శన్ తదితరులు ఉన్నారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం


