
నేరాల్లో పాలుపంచుకున్నవారికి బైండోవర్
కేశంపేట: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ నేరాల్లో పాలుపంచుకున్న వ్యక్తులను మంగళవారం తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ నరహరి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ముందు చర్యల్లో భాగంగా బైండోవర్ చేశామన్నారు. మండల పరిధిలోని కొత్తపేటకు చెందిన భానుచందర్, కేశంపేటకు చెందిన జంగయ్య, మహేశ్, ఎల్లస్వామి, నిర్దవెళ్లికి చెందిన నర్సింహాచారిని బైండోవర్ చేశారు.
ఇద్దరు యువకులకు రిమాండ్
రూ.1.01లక్షల విలువైన 4.04 కిలోల గంజాయి స్వాధీనం
పహాడీషరీఫ్: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. రోషన్ ద్దౌలాలో నివాసం ఉండే బిసా కొమ్రీ అలియాస్ చింటూ(19), కొక్కిలిగడ్డ హారూణ్ అలియాస్ అరుణ్(20), ఒడిశాకు చెందిన అర్జున్ బైక్‌పై శివాజీచౌక్ మీదుగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీల్లో ఉన్న ఎస్‌ఐ కోటేశ్వర్ రావు వారిని సోదాలు చేయగా మూడు ప్యాకెట్లలో రూ.1.01 లక్షల విలువైన 4.04 కిలోల గంజాయి లభ్యమైంది. అర్జున్ పరారీలో ఉండగా.. మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కుతరలించారు.