మున్సిపల్ కార్యాలయంపై దాడి కేసులో ..
మణికొండ: మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో అప్పటి కమిషనర్ పెట్టిన కేసులో భాగంగా విచారణ ప్రారంభం కావటంతోమంగళవారం బీజేపీ నాయకులు కోర్టుకు హాజరయ్యారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలకాపూర్ టౌన్ షిప్ రోడ్డు నెంబర్–13 వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు. దాంతో మున్సిపల్ అధికారులు దాన్ని వెంటనే తొలగించారు. ఆగ్రహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో అప్పటి మున్సిపల్ కమీషనర్ ఫల్గుణ్‌కుమార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా 23 మందిపై కేసు నమోదు చేశారు. మంగళవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టు హాల్లో విచారణకు రావటంతో పార్టీ నాయకులు హాజరయ్యారు.
కోర్టుకు 23 మంది బీజేపీ నాయకులు


