
మూసీకి పెరిగిన వరద
మణికొండ: ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ పరీవాహకంలో భారీ వర్షాలు కురవటంతో మరోమారు జంటజలాశయాల గేట్లను మరింత ఎత్తి ఎక్కువ మొత్తంలో వరదను మూసీ నదికి వదులుతున్నారు. సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం వర్షం కురవటంతో గండిపేటలోకి పైనుంచి 1700 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దాంతో ఆరు గేట్లను మూడు అడుగులు, రెండు గేట్లను రెండు అడుగుల ఎత్తు ఎత్తి 2488 క్యూసెక్కుల నీటిని మూసీ నదికి మంగళవారం సాయంత్రం వదిలారు. హిమాయత్‌సాగర్‌కు పై నుంచి 2వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఆరు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 2500 క్యూసెక్కుల నీటిని మూసీకి వదులుతున్నారు. జంట జలాశయాల నుంచి 5వేల క్యూసెక్కుల నీరు మూసీకి వస్తుండటంతో అది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మంగళవారం రాత్రికి మరింత వర్షం కురిస్తే మరిన్ని గేట్లను ఎత్తుతామని, మూసీ పరీవాహన ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని, నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్లే రోడ్డును మూసేసినట్లు అధికారులు తెలిపారు.
5 వేల క్యూసెక్కుల నీరు విడుదల