12న పద్మశాలీ సంఘం దసరా మేళా
హుడాకాంప్లెక్స్: ఆటోనగర్‌లోని హరిణ వనస్థలి అనన్య ఎకోపార్కులో ఈ నెల 12న పద్మశాలీ సంఘం 23వ దసరా మేళా నిర్వహిస్తున్నట్టు సంఘం ఎల్‌బీనగర్ అధ్యక్షుడు పున్న గణేశ్ నేత తెలిపారు. హుడా కాంప్లెక్స్‌లోని సంఘం కార్యాలయంలో సోమవా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మేళాలో పద్మశాలి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించుకోవడంతో పాటు ప్రముఖుల సంక్షిప్త సందేశాలు, చేనేత కళాకారులకు సన్మానాలు, సమాజ శ్రేయస్సుకు సహకరిస్తున్న పెద్దలకు సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడుతూ.. పద్మశాలీల ఐక్యతకు ఈ మేళా తోడ్పడుతుందని అన్నారు. సమావేశంలో సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూపా సదాశివ్, అఖిల భారత పద్మశాలి యువజన విభాగం అధ్యక్షుడు అవ్వారు భాస్కర్, గుర్రం శ్రావణ్, గడ్డం లక్ష్మీనారాయణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్, స్వప్న, రేఖ, ఊర్కొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాను సందర్శించిన రాచకొండ సీపీ
అబ్దుల్లాపూర్‌మెట్ : రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సోమవారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్న ఆయన రికార్డులను తనిఖీ చేశారు. సీఐ అశోక్‌రెడ్డితో పాటు ఎస్‌ఐలకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నేటినుంచి జోనల్ స్థాయి క్రీడోత్సవాలు
ఇబ్రహీంపట్నం: స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే జోనల్ స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వీటిని ప్రారంభిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లోని అండర్–14, అండర్–17 విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారు. ఆయా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేయనున్నారు.
త్రిపుల్ ఆర్
కొత్త అలైన్‌మెంట్ మార్చాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం త్రిపుల్ ఆర్ కొత్త అలైన్‌మెంట్ మార్చాలని సీపీఎంజిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్‌ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెద్దల కోసం అలైన్‌మెంట్ మార్చి, పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నీతిమాలిన చర్యలు మానుకోవాలని హితవుపలికారు.అలైన్‌మెంట్ మార్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు జగన్, జిల్లా నాయకుడు రాజు, తదితరులు పాల్గొన్నారు.
12న పద్మశాలీ సంఘం దసరా మేళా
12న పద్మశాలీ సంఘం దసరా మేళా


