
పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి
ఇబ్రహీంపట్నం: పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు.పెంచిన చార్జీలను నిరసిస్తూ సోమవారం ఇబ్రహీంపట్నం డిపో వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఆర్టీసీని రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకింద ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.3 వేల కోట్లు బకాయి పడిందని తెలిపారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు చార్జీలను పెంచిందన్నారు. సుమారు 25 వేల మంది ఆర్టీసీ కార్మికులు కో–ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని జమ చేసుకున్న రూ.వెయ్యి కోట్లను గజదొంగ మాదిరిగా రేవంత్ సర్కార్ ఖాళీ చేసిందని ఆరోపించారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బోసుపల్లి ప్రతాప్, గొగిరెడ్డి లచ్చిరెడ్డి, నర్సింహారెడ్డి, రాంరెడ్డి, ధనంజయ్‌గౌడ్, రాఘవేందర్, అనిల్‌కుమార్, శివకుమార్, గోవర్ధన్, శివధర్‌రెడ్డి, సందీప్, ముత్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.