
కాంగ్రెస్ విధానాలను ఎండగట్టాలి
మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్ధానాలకు నిదర్శనమే బాకీ కార్డు అని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం పార్టీ నేతలతో కలిసి బాకీ కార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న ఆరు గ్యారంటీలను 700 రోజులైనా పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకర్గ ఉపాధ్యక్షులు హన్మగళ్ల చంద్రయ్య, కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మండల అధ్యక్షుడు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.