
అడిగిన సమాచారం ఇవ్వండి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఎకై ్సజ్‌శాఖ హైదరాబాద్ డిఫ్యూటీ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు సంబంధిత ఎకై ్సజ్ స్టేషన్‌లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సోమవారం అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధి లోని 11 ఎకై ్సజ్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ టీమ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రెండేళ్లలో మద్యం అమ్మకాల వివరాలను దరఖాస్తు దారులకు ఇవ్వాలని చెప్పారు. అలాగే దరఖాస్తుల సమూనాలో తప్పులు లేకుండా సహకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను అబ్కారీ భవన్‌లోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న కౌంటర్‌లో దాఖలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారిగా డిస్ప్లే చేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి సూచించారు.