ఫలితాల్లో చిట్టచివర | - | Sakshi
Sakshi News home page

ఫలితాల్లో చిట్టచివర

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

వివరాలు ఇలా..

చివరి స్థానాల్లో గంభీరావుపేట, కోనరావుపేట కాలేజీలు

బోధన లోపమా... నిర్లక్ష్యమా ?

నిఘా నీడ ప్రభావమే అంటున్న అధ్యాపకులు

15 శాతంలోపే ఉత్తీర్ణత

గంభీరావుపేట(సిరిసిల్ల): ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా ర్యాంక్‌తో గంభీరావుపేట, కోనరావుపేట జూనియర్‌ కాలేజీలు పోటీపడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా చిట్టిచివరి స్థానంలో జిల్లా నిలిస్తే.. జిల్లా వ్యాప్తంగా అట్టడుగు ఫలితాలు గంభీరావుపేట, కోనరావుపేట జూనియర్‌ కళాశాలలు సాధించాయి. గంభీరావుపేట కాలేజీ ఫస్టియర్‌లో 14 శాతం, సెకండియర్‌లో 12 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కోనరావుపేట కాలేజీ పది శాతం, మోడల్‌స్కూల్‌ 11 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

బోధన లోపమా.. నిర్లక్ష్యమా..

ఇంటర్‌ ఫలితాలపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల పనితీరుపై మండిపడుతున్నారు. సకల సౌకర్యాలు, పూర్తి స్థాయి అ ధ్యాపకులు ఉన్నప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫలితాల వెనుకంజకు కారణాలేంటి ?

బోధనలో నాణ్యత కంటే సిలబస్‌ పూర్తి చేయడంపైనే లెక్చరర్లు దృష్టి కేంద్రీకరించడంతో విద్యార్థుల్లో పునాది బలహీనమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యాపకులపై పర్యవేక్షణ లేకపోవడం, పనితీరు ఆధారంగా సమీక్షలు చేయకపోవడం లోపంగా కనిపిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై అవగాహన లేకపోవడం ఇంటర్‌ ఫలితాలపై ప్రభావం చూపుతోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా తమ ఫెయిల్యూర్‌కు కారణాలపై సమీక్షించుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇయర్‌ విద్యార్థులు ఉత్తీర్ణత

గంభీరావుపేట కాలేజీ..

ఫస్టియర్‌ 131 19

సెకండియర్‌ 114 14

కోనరావుపేట కాలేజీ..

ఫస్టియర్‌ 95 10

సెకండియర్‌ 105 19

మోడల్‌ స్కూల్‌..

ఫస్టియర్‌ 135 15

సెకండియర్‌ 108 39

Advertisement
 
Advertisement
Advertisement