కోనరావుపేట(వేములవాడ): రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సామాజిక బాధ్యతగా ప్రయాణించాలని విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 18 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మండలంలోని నిజామాబాద్‌లో సోమవారం అరైవ్.. అలైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం, డీజీపీల సందేశం వినిపించారు. గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీని ఏర్పాటుచేసి, ప్ర తిజ్ఞ చేయించారు. విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో సీట్‌బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పూర్తిలో జిల్లా ప్రథమస్థానంలో ఉండడంపై కలెక్టర్‌ను అభినందించారు.
జాగ్రత్తగా వెళ్లాలి.. కలెక్టర్
కుటుంబ బాధ్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సహాయం అందించే వారికి ప్రభుత్వం రహవీర్ కింద రూ.25వేలు సహాయం అందిస్తుందని తెలిపారు.
రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ.
రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలి పారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంకెన్‌డ్రైవ్‌తోనే జరుగుతున్నాయన్నారు. గ్రామ రోడ్‌సేఫ్టీ కమిటీ గుంతలు, వీధిదీపాల సమస్య, రోడ్ల వెంట బావులపై నివేదిక ఇవ్వాలన్నారు. సర్పంచులు శ్రీహరి, దేవరాజు, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్‌చైర్మన్ ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో నటరాజ్, ఎంఈవో మురళీనాయక్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


