నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

● ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

● ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వేసవి నేపథ్యంలో నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్లను సోమవారం తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్‌లోని యార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 431 కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వాటిని నెలవారీ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించినట్లు తెలిపారు. గతంలో సెస్‌ హయాంలో ఒకే బ్రేకర్‌ ద్వారా 2–3 ఫీడర్లను అనుసంధానించడంతో విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు కలిగేవన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.1.5 కోట్లతో అదనంగా 20 బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ భిక్షపతి, డీఈ అంజయ్య, ఏడీఈ శ్రీనివాస్‌, రాజలింగం, ఏఈ పృథ్వీధర్‌గౌడ్‌, ఏఈ ఆనందర్‌, రాజేందర్‌ ఉన్నారు.

సబ్‌స్టేషన్‌ ఇట్లనే ఉంటుందా?

ఎల్లారెడ్డిపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి సబ్‌స్టేషన్‌ పరిసరాలు పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌ పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరగడం, అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ నెల రోజుల్లో వస్తానని.. సబ్‌స్టేషన్‌ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement