రెవెన్యూలో బదిలీల కుదుపు! | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో బదిలీల కుదుపు!

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

● ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డీటీలు బదిలీ ● వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌ ● రెవెన్యూ పరిపాలన బలోపేతం కోసం బదిలీలు

● ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డీటీలు బదిలీ ● వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌ ● రెవెన్యూ పరిపాలన బలోపేతం కోసం బదిలీలు

బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో పరిపాలన బలోపేతానికి రెవెన్యూశాఖలో తాత్కాలిక బదిలీలు చేపట్టారు. బదిలీలపై బ్యాన్‌ ఉండడంతో డిప్యూటేషన్‌పై బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్‌లను డిప్యూటేషన్‌ చేస్తూ కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఈనెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు జరిగిన చోట్లలో తాత్కాలిక బదిలీలుగానే పేర్కొన్నారు.

బదిలీలు వీరికే..

ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఎన్‌.శ్రీనివాస్‌ను గంభీరావుపేట తహసీల్దార్‌గా, సూపరింటెండెంట్‌–ఈ కలెక్టరేట్‌గా, వెయిటింగ్‌లో ఉన్న టి.వైశాలిని వీర్నపల్లి తహసీల్దార్‌గా, సూపరింటెండెంట్‌–డీ కలెక్టరేట్‌గా డిప్యూటేషన్‌ వేశారు. ఇల్లంతకుంట తహసీల్దార్‌ ఎం.ఏ.ఫారుక్‌ను ముస్తాబాద్‌ తహసీల్దార్‌, బోయినపల్లి తహసీల్దార్‌ కాలె నారాయణరెడ్డిని వీర్నపల్లి తహసీల్దార్‌గా డిప్యూటేషన్‌ వేశారు. కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ హెచ్‌అండ్‌ఐగా ఉన్న ఎం.డి.షరీఫ్‌ మొయినొద్దీన్‌ను డిప్యూటేషన్‌పై బోయినపల్లి తహసీల్దార్‌గా, ముస్తాబాద్‌ తహసీల్దార్‌ బి.రాంచందర్‌ను సూపరింటెండెంట్‌ కలెక్టరేట్‌ హెచ్‌ అండ్‌ఐగా డిప్యూటేషన్‌ వేశారు. సూపరింటెండెంట్‌–డీ కలెక్టరేట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌.సురేశ్‌ను ఇల్లంతకుంట తహసీల్దార్‌గా నియమించారు. కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌–ఈగా ఉన్న జి.వేణును ఎల్లారెడ్డిపేట డిప్యూటీ తహసీల్దార్‌గా డిప్యూటేషన్‌, ఎల్లారెడ్డిపేట డీటీ వి.మురళీకృష్ణను తంగళ్లపల్లి డిప్యూటీ తహసీల్దార్‌గా డిప్యూటేషన్‌ వేశారు. కాగా త్వరలో మరికొంతమంది ఆర్‌ఐలను, డీటీలకు బదిలీల తాకిడి ఉంటుందని అనుకుంటున్నారు.

సతాయింపులకు చెక్‌పడేనా?

కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు వివిధ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లే ప్రజలను సతాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్ల విషయంలో ఏదో వంకతో జాప్యం చేయాలని చూస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement