అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు | - | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

సిరిసిల్లటౌన్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న కొలనూర్‌కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. కోనరావుపేట మండలం కొలనూరుకు చెందిన గోరింటాల జ్యోతి–రమేశ్‌ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రమేశ్‌ సిరిసిల్లలో పవర్‌లూం వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు కూతుళ్లు సిరిసిల్లలోని జూనియర్‌ కాలేజీలో చదువుకుంటున్నారు. ధరణి బైపీసీ(433), పూజ 492 (ఎంపీఎస్‌డబ్ల్యూ), పల్లవి 490(ఎంపీఎస్‌డబ్ల్యూ) సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ రఘునందన్‌, అధ్యాపకులు ఇంటికెళ్లి సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement