ఎండల్లో జరభద్రం నీటిశాతం కోల్పోయే ప్రమాదం తరచూ నీటిని తీసుకోవాలి వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్‌వో రజిత
వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడవుతుంటాయి. తాజా ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ తినాలి.
మండుటెండలకు బయటకు వెళ్లవద్దు.
శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండేందుకు తరచూ నీరు తాగుతుండాలి.
ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ‘సీ’ విటమిన్ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. మజ్జిగ, ఓఆర్‌ఎస్ వంటివి తాగాలి.
ఇక కాటన్, పలుచటి వస్త్రాలు ధరించడం మంచిది.
పనికి వెళ్లిన వారు ఏకధాటిగా ఎండలో ఉండకుండా మధ్యలో విరామం ఇవ్వాలి.
వడదెబ్బ నుంచి రక్షణకు
బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రం గంభీరావుపేట, లింగన్నపేట మధ్య మానేరువాగుపై నిర్మించతలపెట్టిన హైలెవల్ వంతెన పనులను వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. మానేరువాగు వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మళ్లీ వానాకాలంలో వాగు ఉప్పొంగి రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయేలా ఉన్నాయన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మల్లేశంయాదవ్, దేవేందర్‌యాదవ్, సత్యనారాయణ, వాజిద్ హుస్సేన్, ఎల్లం, శ్రీనివాస్, విగ్నేశ్‌గౌడ్, మోహన్, నర్సింలు, దుర్గేశ్, రవీందర్‌నాయక్, నరేశ్ పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: ఎండల నుంచి రక్షణకు అప్రమత్తంగా ఉంటూ.. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌వో) రజిత సూచించారు. అధిక ఉష్ణోగ్రతలతో శరీరంలో నీటినిల్వలు తగ్గే ప్రమాదం ఉందని.. తరచూ నీటిని తాగాలని సూచించారు. ఎండలు దంచికొడుతుండడంతో రక్షణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలపై జిల్లా వైద్యాధికారి ‘సాక్షి’కి వివరించారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంతో ‘సాక్షి’కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వివరించారు.
శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి
మండుటెండలకు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంటాయి. ఫలితంగా శరీరంలో నీటిశాతం పడిపోవడంతో డీహైడ్రేషన్‌తోపాటు జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, విరోచనాలు, రక్తపోటు(బీపీ)లో హెచ్చుతగ్గులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ సమస్యలు, వేడిదద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండదెబ్బకు గురయ్యే వారికి జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన చికిత్స లభిస్తుంది. ఎండాకాలం జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
సరైన జాగ్రత్తలు తప్పనిసరి
ఎండాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు తలనొప్పి తొలి హెచ్చరికగా భావించా లి. వెంటనే తగ్గకుంటే డాక్టర్‌ను సంప్రదించా లి. ఈకాలంలో ఒత్తిడి, నిద్రలేమి, చికాకు, ఉత్సాహం తగ్గడం, నీరసించిపోవడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించాలి.
సరిపడా నీరు తాగాలి
వేసవిలో చాలా మందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం, గాలిలో తేమశాతం తక్కువగా ఉండటం వంటి కారణాలతో శరీరం నుంచి నీరు బయటకు ఎక్కువగా పోతుంటుంది. ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీరు తగ్గినప్పుడు కండరాలు పట్టేస్తాయి. కండరాలకు శరీరం నుంచి తగిన ఆక్సిజన్ అందనప్పుడు ఇతరమార్గంలో అవసరాలు తీర్చుకునే క్రమంలో ల్యాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కిడ్నీలపై ప్రభావం చూపి ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నీళ్ల విరోచనాలు కూడా కిడ్నీలు పాడవడానికి కారణమవుతాయి.
చల్లని పానీయాలు సేవించొద్దు
ఎండాకాలంలో అతిచల్లని నీటిని, శీతల పానీయాలు అస్సలు సేవించొద్దు. ఎండ నుంచి వచ్చిన వారు సాధారణ నీరు తాగడం శ్రేయస్కరం. చల్లని నీరు, రసాలు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. అతిగా వ్యాయామం చేయడం సరికాదు. తగిన విరామంతో సరిపడినంత నీరు తీసుకుంటూ.. వ్యాయామం చేయాలి. ఎండలో తిరిగొచ్చిన వారు వెంటనే చల్లని నీటిని సేవించినా, స్నానం చేసినా రక్తనాలాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి


