న్యూస్‌రీల్
ఆరోగ్య‘యోగం’
సిరిసిల్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యం కనీసం అరగంట పాటు యోగా సాధన చేయాలని కోరారు. అనంతరం యోగాసనాలు వేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, డీవైఎస్‌వో రాందాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


