చౌడాలమ్మకు మొక్కులు | - | Sakshi
Sakshi News home page

చౌడాలమ్మకు మొక్కులు

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

● మైనింగ్‌ ఏడీ క్రాంతికుమార్‌

కోనరావుపేట: కొండాపూర్‌లో చౌడాలమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పూజలు చేశారు.

తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు

గంభీరావుపేట(సిరిసిల్ల): తాగునీటి సమస్య పరిష్కరించాలని గంభీరావుపేట మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని దోసలగూడెం కాలనీవాసులు శుక్రవారం రోడ్డెక్కారు. బస్టాండ్‌ సమీపంలో ఖాళీ బిందెలతో బైఠాయించారు. వారు మాట్లాడుతూ వారం రోజులుగా తమ కాలనీలో నీరు రావడం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, నాయకులు మద్దెల రాజనర్సు, పిట్ల రఘు, ప్రవీణ్‌కుమార్‌, చక్రధర్‌, వంశీ, కిషన్‌, అనంతరాములు పాల్గొన్నారు.

కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలి

సిరిసిల్ల: కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలని లెప్రసీ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ రాజు కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత ఆధ్వర్యంలో పీహెచ్‌సీల వైద్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. రాజు మాట్లాడుతూ కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. లెప్రసీ లక్షణాలను ప్రచారం చేయాలన్నారు. అంతకుముందు సుందరయ్యనగర్‌, అంబేడ్కర్‌నగర్‌, తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లెప్రసీపై అవగాహన కల్పించారు. రాష్ట్ర పరిశీలకుల బృందం సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరాచారి, సకలరెడ్డి, సురేందర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అనిత, డాక్టర్‌ సంపత్‌, డాక్టర్‌ రామకృష్ణ, డీపీఎంవో దేవిసింగ్‌ పాల్గొన్నారు.

ఆయుర్వేదిక్‌ వైద్యశిబిరం

సిరిసిల్లటౌన్‌: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆయుష్‌ హోమియోపతి డే సందర్భంగా ఉచిత ఆయుర్వేదిక్‌ ఆరో గ్య శిబిరాన్ని సిరిసిల్లలోని యూహెచ్‌సీలో శుక్రవారం నిర్వహించారు. అంబేడ్కర్‌నగర్‌లో నిర్వహించిన ఆయుర్వేదిక్‌ వైద్యశిబిరాన్ని డీఎంహెచ్‌వో రజిత ప్రారంభించారు. వైద్యాధికారి రేఖ, డీడీఎం కార్తీక్‌ పాల్గొన్నారు.

‘మన ఇసుక మన వాహనం’ వినియోగించుకోవాలి

బోయినపల్లి(చొప్పదండి): ఇసుక తరలింపులో పారదర్శకత కోసం అమలు చేస్తున్న ‘మన ఇసుక– మన వాహనం’ వినియోగించుకోవాలని జిల్లా మైనింగ్‌ ఏడీ క్రాంతికుమార్‌ కోరారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం ట్రాక్టర్‌ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్ణీతపత్రాలు జత చేసి.. ఆన్‌లైన్‌ విధానం ద్వారా సులభంగా బుకింగ్‌ చేసుకునే వీలు ఉందన్నారు. తహసీల్దార్‌ కాలె నారాయణరెడ్డి, ఆర్‌ఐ మనోజ్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement