‘అరైవ్‌..అలైవ్‌’ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘అరైవ్‌..అలైవ్‌’ నిర్వహించాలి

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల క్రైం: జిల్లాలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్‌ అలైవ్‌’ నిర్వహించాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆదేశించారు. ఏప్రిల్‌ 13 నుంచి 18 వరకు నిర్వహించే కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మంచి ప్రవర్తనతో జీవిస్తున్న వారిపై షీట్స్‌ తొలగిస్తామని తెలిపారు. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గోల్డెన్‌ అవర్‌లో తక్షణ సహాయం అందించేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కౌన్సిలర్ల ఆటవిడుపు

సిరిసిల్లటౌన్‌: కేసిఆర్‌ కప్‌లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడారు. చైర్‌పర్సన్‌ వర్సెస్‌ వైస్‌చైర్మన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చైర్‌పర్సన్‌ టీం గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement