సిరిసిల్లటౌన్: చిన్నారి అంబటి సహస్ర అనా రోగ్యం బారిన పడగా తోటి విద్యార్థులు చేయూతనందించారు. సిరిసిల్లకు చెందిన నేతకార్మిక దంపతులు అంబటి వర్ష–వేణుకు ఇద్దరు కూతుళ్లు అమృత, సహస్ర, కొడుకు అన్విత్. పెద్దకూతురు అమృత ఐదేళ్ల క్రితం లివర్ పాడై చనిపోయింది. ఫిబ్రవరిలో చిన్న కూతురు సహస్ర లివర్ వ్యాధి బారిన పడటంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. వైద్యులు రూ.20లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడంతో అచేతనస్థితిలో ఉన్న వేణు దంపతుల దీనగాథను సాక్షిలో ‘అయ్యో పాపం సహస్ర’ శీర్షికను ప్రచురించింది. దీంతో పలువురు స్పందించి ఆర్థికసాయం అందించారు. సహస్ర చదువుకునే మహర్షి హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రూ.55వేలు జమచేసి అందజేశారు. సహస్ర తల్లి కూతురుకు లివర్ ఇవ్వడంతో ఇద్దరూ కోలుకుంటున్నారు. స్కూల్ కరెస్పాండెంట్ బూర శ్రీనివాస్ మాట్లాడుతూ సహస్రకు వచ్చే అకాడమీలో ఫీజు తీసుకోబోమన్నారు. ప్రిన్సిపాల్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.


