● జాన్ 2న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి/రుద్రంగి(వేములవాడ): నిస్సహాయులకు సాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి, రుద్రంగి మండలాల్లోని పలువురు లబ్ధిదారులకు గురువారం సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. చందుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.18.47లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేద కుంటుంబంలోని కుటుంబ పెద్దకు బీమా కల్పించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2006లో నిర్వహించిన ప్రజాపథంలో చందుర్తి మండలం మల్యాలకు వచ్చిన క్రమంలో ఈ ప్రాంత సమస్యలు అడిగి తెలుసుకున్నారని గుర్తు చేశారు. అప్పుడే చందుర్తి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు మంజూరు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌తో తనకున్న అనుబంధంతోనే రెండు కాలేజీలు, ఎల్లంపల్లి నీరు, వేములవాడ – కోరుట్లకు డబుల్ రోడ్డు తీసుకొచ్చానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో వేములవాడ–కోరుట్లకు త్రీలేన్స్ రోడ్డుకు రూ.156 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. నిరుపేదలకు ఎల్‌వోసీలు అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు సా గుతున్నాయని వివరించారు. కాలేజీ ఇన్‌చార్జి ప్రి న్సిపాల్ కృష్ణాకర్, చందుర్తి సర్పంచ్ పులి సత్తయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో లెంకల రాధ, పంచా యతీరాజ్ డీఈ పవన్‌కుమారి, సర్పంచ్‌లు కటకం మల్లేశం, మోకినపల్లి దేవరాజు, దూది శ్రీనివా స్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, జిల్లా కార్యదర్శి గొట్లె ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ముస్కు మకుందరెడ్డి పాల్గొన్నారు.


