కోనరావుపేట(వేములవాడ): ఇసుక తరలింపులో పారదర్శకత కోసమే మన ఇసుక వాహనం అమలు చేస్తున్నామని, గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మైనింగ్ ఏడీ క్రాంతికుమార్ పేర్కొ న్నారు. మన ఇసుక వాహనం ఆన్‌లైన్ విధానం, అప్లికేషన్ డౌన్‌లోడ్, ఆన్‌లైన్‌లో అనుమతులు జారీ తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మండల పరిషత్ కార్యాలయంలో పంచా యతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులకు గురువారం అవగాహన కల్పించారు. మన ఇసుక వాహనం ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్‌ల నుంచే ఇసుక తరలించాలన్నారు. ఇసుక తరలింపులో నేరుగా కూపన్లు ఇచ్చే విధానం నుంచి ఆన్‌లైన్ ద్వారా పొందే విధానం అమలుచేస్తామని, ఇసుక కేటాయింపు, తరలింపు పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో నటరాజ్, సూపరింటెండెంట్ శంకర్‌రెడ్డి, ఏపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


