గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామంలోని పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, సిబ్బంది జీతభత్యాలు, వీధిలైట్ల మరమ్మతులకే సరిపోవడం లేదు. పాత విద్యుత్ బకాయిలు చెల్లించడం తలకు మించిన భారమవుతుంది. ప్రభుత్వ కరెంట్ బిల్లుల కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి.
– ఎలగందుల నర్సింలు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్
బకాయిలతో ఇబ్బందులు
జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు రూ.701 కోట్లకు పైగానే సెస్‌కు బకాయిలు ఉన్నాయి. గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాలు, వినియోగదారులు బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇబ్బందిగా ఉంది. జీపీలకు వచ్చే ఆదాయం నిర్వహణకే సరిపోతున్నాయి. ప్రభుత్వమే బకాయిలు చెల్లించి జీపీల మనుగడకు సహకరించాలి.
– ఇల్లందుల గీతాంజలి, రాచర్లబొప్పాపూర్ సర్పంచ్


