
వీధి వ్యాపారుల వివరాలు నమోదు చేయాలి
కోల్‌సిటీ(రామగుండం): పీఎం స్వనిధి పథకం ప్ర యోజనాలు పొందేందుకు వీధివ్యాపారులను గు ర్తించి, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని రా మగుండం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో మంగళవారం మెప్మా సీవోలు, ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, చిరువ్యాపారుల ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకంలో లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా వారు తొలివిడతలో రూ.10వేలు, రెండోవిడతలో రూ.20వేలు, మూడోవిడతలో రూ.50వేల వరకు బ్యాంకు రుణం పొందడానికి అవకాశం ఉంటుందని వివరించారు. వీధివ్యాపారులతో కామన్ ఇంటరెస్ట్ గ్రూప్‌లు ఏర్పాటు చేయించాలని ఆయన కోరారు. అలాగే ఇంటింటా పర్యటించి నిరుపేద మహిళలను గుర్తించి కొత్త స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం అందించడానికి అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి, అర్హులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, శమంత తదితరులు పాల్గొన్నారు.
రామగుండం బల్దియా అదనపు కమిషనర్ మారుతీప్రసాద్