
ఎన్టీపీసీలో పోలీసుల తనిఖీలు
● ఉద్యోగుల విధులకు ఆటంకం
● అవగాహన కల్పించిన ఏజీఎం సిగ్దర్
జ్యోతినగర్(రామగుండం): ఎన్నికల తనిఖీల్లో భా గంగా ఎన్టీపీసీ పోలీసులు రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ రోడ్డులో మంగళవారం విస్తృతంగా తనిఖీ లు చేశారు. తనిఖీలు చేపట్టిన సమయం, ఎన్టీపీసీ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయం ఒకటే కావడం సమస్యగా మారింది. ప్రధానంగా తనిఖీలతో ఎన్టీపీసీ ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యా రు. రామగుండంలోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్ నుంచి ప్లాంట్ వెళ్లే రహదారిని ప్రత్యేకంగా నిర్మించిన విషయం విదితమే. ఈ మేరకు ఉద్యోగులు, అ ధికారులు విధి నిర్వహణ సమయంలో ఈరోడ్డు ద్వారానే సకాలంలో వెళ్తారు. అయితే, ఉద్యోగులు, అధికారులు విధులకు వెళ్తున్న సమ యంలోనే పోలీసులు తనిఖీలు చేయడంతో విధు లకు హాజరు ఆలస్యమైంది. దీంతో ఉద్యోగులు హె చ్‌ఆర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్ పోలీసుల వద్దకు చేరుకున్నా రు. ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయం మించిపోతోందని వివరించడంతోపాటు పోలీసు క మిషనర్‌కు సైతం సమాచారం అందించారు. దీంతో పోలీసులు తనిఖీలు నిలిపివేశారు.