
బకాయిలు చెల్లించాలి
రామగిరి(మంథని): రాష్ట్రప్రభుత్వం సింగరేణికి బ కాయిపడ్డ రూ.43వేల కోట్లను వెంటనే చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డి మాండ్ చేశారు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–2పై ఏరి యా కార్యదర్శి రౌతు రమేశ్ అధ్యక్షతన సోమవా రం ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాం నుంచి బకాయిలు ఉన్నా యని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లిస్తుందనుకుంటే పైసా ఇవ్వడంలేదన్నారు. సింగరే ణి తప్పుడు లాభాలు ప్రకటించి కార్మికులను మో సం చేసిందని ఆరోపించారు. సింగరేణి లాభాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి సారంగాపాణి, ఏరియా ఉపాధ్యక్షుడు ఆర్కా ల ప్రసాద్‌గౌడ్, ఉప ప్రదాన కార్యదర్శి వేణుగోపాలరావు, నాయకులు గోగుల విద్యాసాగర్, మర్రి సంతోష్, కె.శ్రీనివాస్, కాసెట్టి నగేశ్, బండారి శ్రీనివాస్, గోగుల రవీందర్, పొన్నగంటి శ్రీనివాస్ ఎండీ జానీ మియా తదితరులు పాల్గొన్నారు.