
‘కాకా’ జయంతి
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి (కాకా) జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ పూలమాల వేసి నివాళి అర్పించారు. కాకా ప్రజాసేవలో రాణిస్తూ కేంద్రమంత్రిగా పనిచేయడంతో పాటు అనేక పదవులు చేపట్టారని పేర్కొన్నారు. కార్మిక సంక్షేమానికి పాటుపడ్డ వెంకటస్వామి కార్మికుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడన్నారు. అధికారులు రవీందర్, సురేశ్, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏఓ శ్రీనివాస్, బండి ప్రకాశ్, ప్రసాద్ తదితరులున్నారు.