
ఇందిరమ్మకు ఉపాధి
ఈజీఎస్‌తో అనుసంధానం 90 రోజులు పనిదినాలు కల్పించేలా చర్యలు నిర్మాణ పనుల వేగవంతానికి సర్కారు కసరత్తు
మంథనిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పనుల వేగవంతానికి కసరత్తు ప్రారంభించింది. ఇందు కోసం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఉపాధి హామీని అను సంధానం చేసింది. ఇందిరమ్మ ఇంటి నిర్మా ణం చేసుకునే లబ్ధిదారు జాబ్ కార్డు కల్గి ఉంటే 90 రోజు లు పనిదినాలు కల్పించేలా చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణాలకు కూలీల కొరత లేకుండా సదరు లబ్ధిదారు పని చేసుకుని కూలి పొందనుండడంతో పనులు వేగవంతంగా సాగే అవకాశాలున్నాయి.
మొదలైన గుర్తింపు ప్రక్రియ
జిల్లాలోని 14 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. అయితే అనేక గ్రామాల్లో నిర్మాణాలు నత్తనడకనే సాగుతుండడంతో పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఉపాధి పథకం అనుసంధానం చేసింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో ఇంటి నిర్మాణ దశలను పరిశీలించి గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు.
జిల్లాలో 277 ఇళ్ల గుర్తింపు.
జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి పథకం కింద ప్రస్తుతం 277 ఇళ్లను గుర్తించారు. ఇంటి నిర్మాణంలో బేస్‌మెంట్ స్థాయి, గోడల నిర్మాణం, స్లాబ్ లెవల్‌వరకు జరిగిన ఇళ్లను ఎంపిక చేశారు. ఈ స్థాయిలో ఉన్న ఇళ్ల లబ్ధిదారు ఈజీఎస్ పనులకు వెళ్లకుండా ఇంటి నిర్మాణ పనులకు రోజూ మస్టర్ వేసి కూలి చెల్లించనున్నారు.
90రోజుల పనిదినాలు
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలు పెట్టి ఉపాధి హామీలో జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారుకు బేస్‌మెంట్ స్థాయి వరకు 40 రోజులు, స్లాబ్ లెవన్ వరకు 50రోజుల పనిదినాలు కల్పించనున్నారు. 90రో జుల పనిదినాలకు సదరు లబ్ధిదారుకు రూ.27,630 చెలించనున్నారు. దీంతో సొంతింటి నిర్మాణానికి కూలీ పని చేసుకుని లబ్ధి పొందే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు అయింది.
78 ఇళ్లు గుర్తించాం
మంథని మండలం అడవిసోమన్‌పల్లి గ్రామంలో 78 ఇళ్లను గుర్తించి ఉపాధి పథకానికి అనుసంధానం చేశాం. ఉపాధి హామీ జాబ్‌కార్డు కల్గిన లబ్ధిదారు ఇంటి నిర్మాణానికి అవసరమైన పనులు చేసుకోవాలని అందుకు మస్టర్ వేస్తామని చెప్పాం. 90రోజులు పనిదినాలు కల్పించి వారి ఖాతాలో వేతనాలు జమ చేస్తాం.
– సదానందం, ఏపీవో, మంథని