
భారీ వర్షం.. నేలవాలిన వరి
పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/జూలపల్లి/సుల్తానాబాద్/ఓదెల: జిల్లా కేంద్రం పెద్దపల్లితో పాటు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపల్లి మండలం కొత్తపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. కాల్వశ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ అండర్ బ్రిడ్జి దాటేందుకు యత్నించగా నీటి ఉధృతితో మధ్యలోనే చిక్కుకుపోయింది. ఈ మార్గం మీదుగా కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జమ్మికుంట మండలాలకు వెళ్లే వాహనదారులు ఇ బ్బందిపడ్డారు. జూలపల్లి మండలంలో 18.3మి.మీ వర్షపాతం నమోదైంది. సుల్తానాబాద్‌లో వరదనీటితో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఎలిగేడు మండలం ధూళికట్టలో పొట్టదశకు వచ్చిన వరి నేలవాలింది. ఓదెల మండల కేంద్రంతోపాటు కొలనూర్, కనగర్తి, గోపరపల్లె, పొత్కపల్లి, గుంపుల, గూడెం గ్రామాల్లో వరిపంటలు నేలవాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద నీటిలో చిక్కిన ట్రాక్టర్
ఎలిగేడులో నేలవాలిన వరి
కొలనూర్‌లో..

భారీ వర్షం.. నేలవాలిన వరి