
ఎప్పుడూ ఎదురుచూసుడే
పెద్దపల్లి నుంచి మంథనికి పోదామని వత్తే ఎన్నడూ బస్సు టైంకు రాదు. ఎప్పుడు గంటలు, పొంటెల కొద్ది ఎదురుచూసుడే. మంథని వైపు వెళ్లేందుకు మరిన్ని బస్సులు నడిపి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలె.
– రజిత, కాచాపూర్
రెండుగంటల నుంచి..
పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్లేందుకని బస్టాండ్‌కు వచ్చి రెండుగంటల నుంచి బస్సు కోసం నిరీక్షిస్తున్నా. నాలాగే ఇంకా ఎందరో ప్రయాణికులున్నారు. అధికారులను అడిగితే బస్సు వస్తుందని అంటున్నరే తప్ప బస్సు జాడైతే లేదు.
– రామయ్య, భూపాలపల్లి
మరిన్ని బస్సులు నడిపితేనే మేలు
పెద్దపల్లి–మంథని నడుమ ఇప్పుడున్న బస్సులు సరిపోతలేవు. అధికారులు మరిన్ని బస్సులు నడిపి ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేయాలె. బస్సు బాధలు తీర్చాలె.
– మధునమ్మ, నారాయణపల్లి

ఎప్పుడూ ఎదురుచూసుడే

ఎప్పుడూ ఎదురుచూసుడే