పెద్దపల్లిరూరల్: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్‌రెడ్డిని పెద్దపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగు చ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
బకాయిలు చెల్లించాలి
పెద్దపల్లిరూరల్: ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని ఉమ్మడి జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటర్మైంట్ బెనిఫిట్స్ మంజూరులో జాప్యం సరికాదన్నారు. గ్రాట్యుటీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షలు ఇస్తుండగా రాష్ట్రప్రభుత్వం రూ.16 లక్షలు చెల్లించి చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. బకాయిల కోసం ఈనెల 7న కలెక్టరేట్‌ల ఎదుట నిరసన చేపడతామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు ప్రభాకర్‌రావు, దివాకర్, వెంకటరెడ్డి, వెంకటరాములు తదితరులు ఉన్నారు.
చెరువులో వ్యర్థాల తొలగింపు
పెద్దపల్లిరూరల్: స్థానిక ఎల్లమ్మ, గుండమ్మ చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను కమిషనర్ వెంకటేశ్, అఽధికారులు, సిబ్బందితో శనివారం ప్రారంభించారు. స్వచ్ఛ తా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రతీఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు ఇంటి ఆవరణ, వీధులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. మేనేజర్ లింగయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఓవర్‌మెన్‌లకు నష్టం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణిలో ఇంటర్నల్ అండర్ మేనేజర్ పోస్టుల కోసం చేపట్టిన పరీక్షల్లో సీనియర్ ఓవర్‌మెన్ నష్టపోతున్నామని 2014, 2015, 2016 ఎస్‌ఎంఎస్ బ్యాచ్ సీనియర్ ఓవర్‌మెన్‌లు శనివా రం ఆవేదన వ్యక్తం చేశారు. ఈఏడాది జూలై 13న నిర్వహించిన అండర్ మేనేజర్ (ఈ–2) ఇంటర్నల్ పరీక్షలో 72 శాతం మార్కులు వచ్చి నా ఎంపిక కాలేదన్నారు. ప్రతీ ఇంటర్నల్ అండర్ మేనేజర్ నోటిపికేషన్‌కు జూనియర్ ఓవర్‌మెన్‌కు వన్‌టైం మేజర్ కింద అనుమతించడంతో వారే అండర్ మేనేజర్ ఉద్యోగం పొందే అవకాశం ఏర్పడిందని వారు అన్నారు. ఈ పద్ధతి మార్చాలని వారు కోరుతున్నారు.
అమ్మవారి సన్నిధిలో పూజలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్‌టీపీసీ మేడిపల్లి రోడ్డులో త్రిశూల్ యూత్ ఏర్పాటు చేసిన దు ర్గాదేవిని మిరాయి సినిమా రచయిత మణిబాబు శనివారం దర్శించుకుని ప్రత్యేకపూజలు ని ర్వహించారు. అర్చకులు వానమామలై రామాచార్యులు, జయంద్ర సరస్వతీ ఆయనకు శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. ప్రజలు సు ఖసంతోషలతో ఉండాలని అమ్మవారిని వేడు కున్నట్లు రచయిత మణిబాబు తెలిపారు. కార్యక్రమంలో త్రిశూల్ యూత్ సభ్యులు, అఖిల భారతీయ అయ్యప్పస్వామి ధర్మ ప్రచారసభ రాష్ట్ర పీఆర్‌వో తిరుపతి, శంకర్, చంద్రకళ, సుజాత, భక్తులు పాల్గొన్నారు.
డీజీపీని కలిసిన ఎమ్మెల్యే
డీజీపీని కలిసిన ఎమ్మెల్యే
డీజీపీని కలిసిన ఎమ్మెల్యే