
అభివృద్ధి పథకాలను వివరించాలి
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడ మే ధ్యేయంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిస్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచించారు. అంతర్గాం మండలానికి చెందిన గీట్ల శంకర్‌రెడ్డి, కుర్ర నూకరాజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఠాకూర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేప ట్టే అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి, దీటి బాలరాజు, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. కాగా, సింగరేణిలోని మహిళా కాంట్రాక్టు కార్మికులు ఎమ్మెల్యేను కలిశారు. రూ.500 బోనస్ పెంపుపై కృతజ్ఞతలు తెలిపారు.
డ్రోన్ నిర్వాహకుడికి సన్మానం
రామగుండం: గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా గోదావరిలో గల్లంతైన నారకట్ల రాజేశ్ మృతదే హం ఆచూకీ కనుగొడంలో కీలకంగా వ్యవహరించిన లింగాపూర్ గ్రామంలోని డ్రోన్ ఆపరేటర్ పులి శివను ఎమ్మెల్యే ఠాకూర్ శాలువతో సత్కరించారు. అదేవిధంగా గ్రూప్–1 ఉద్యోగం సాధించిన లింగాపూర్ గ్రామానికి చెందిన ఇజ్జగిరి సాయికిరణ్‌ను కూడా ఎమ్మెల్యే సన్మానించారు. కాంగ్రెస్ ప్రతినిధులు జగన్‌మోహన్‌రావు, అర్శనపల్లి శ్రీనివాస్, అడిచర్ల చంద్రమౌళి, కాంపెల్లి చంద్రయ్య ఉన్నారు.
దుర్గామాత సన్నిధిలో పూజలు..
గోదావరిఖనిటౌన్: అడ్డగుంటపల్లి ఆర్యవైశ్యభవన్‌లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి సన్నిధిలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కోసం స్థానిక కళాశాల ప్రాంగణంలో స్థల పరిశీలన చేశారు.