
‘ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత నాదే’
చెవిలో చెప్పే మాటలకు ప్రాధాన్యం లేదు
పార్టీకోసం కష్టపడే నాయకులకే టికెట్లు
సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మారం(ధర్మపురి): ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత తన దేనని, పార్టీ శ్రేణుల సమష్టి నిర్ణయంతోనే టికెట్లు కేటాయిస్తామని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. టికెట్ల విషయంపై ఆశావాహులతో మంత్రి వేర్వేరుగా మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా నాయ కులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. వ్యక్తిగత అజెండాతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయరాదని సూచించారు. చెవిలో చెప్పే మాటలకు ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రజల్లో బలం ఉన్న, పార్టీకి విశ్వాసం కలిగిఉన్న నాయకులకే అవకాశం ఉంటుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. టికెట్ల కేటాయింపుల్లో అపోహలకు తావుఉండరాదని అన్నారు. టికెట్లు రాని నాయకులు నిరాశకు గురికావద్దని, తర్వనే భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం కమిగా చైర్మన్ సంతోష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి పాల్గొన్నారు.