
గెలుపు గుర్రాలకే టికెట్లు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి
పెద్దపల్లిరూరల్: బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని, అందుకోసం వచ్చే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించి క్షేత్రస్థా యి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ జి ల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక స మావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, జి ల్లావ్యాప్తంగా మెజారిటీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుదామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బీజేపీకి ప్రజ ల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీలో గ్రూపు రాజకీయాలకు తా వు లేదని, అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తామని అ న్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. దోపిడీ ప్రధాన ఎజెండా పాలించిందని ధ్వజమెత్తా రు. నాయకులు అర్జున్‌రావు, సురేశ్‌రెడ్డి, పర్వతా లు, ఠాకూర్ రాంసింగ్, రమణారెడ్డి, హన్మంతుగౌ డ్, సదానందం, పర్శ సమ్మయ్య, అశోక్‌రావు, మ హేశ్, అంజయ్య, వీరేశం, ప్రదీప్‌కుమార్ ఉన్నారు.