దుర్గామాత సన్నిధిలో పూజలు | - | Sakshi
Sakshi News home page

దుర్గామాత సన్నిధిలో పూజలు

Oct 4 2025 8:02 AM | Updated on Oct 4 2025 8:04 AM

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): స్థానిక హరిహర క్షేత్రంలో దుర్గామాత సన్నిధిలో హైకోర్టు న్యాయవాది యెరబాటి అశోక్‌రావు దంపతులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. దుర్గామాత కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర సమరయోధుడు రాజేశ్వర్‌రావు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మాచార్య నరెడ్ల సదానందం, జకోటియా వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

అహింసే గాంధీజీ ఆయుధం

గోదావరిఖని: అహింసే అందరికీ ఆయుధం కావాలనే లక్ష్యంతో జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా గుర్తు చేశారు. సీపీ కార్యాలయంలో గాంధీజీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడారు. జాతిపిత చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని ఆయన కోరారు. దసరా సందర్భంగా కమిషనరేట్‌లో ఆయుధ, వాహన పూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్‌, కరుణాకర్‌, అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ భీమేశ్‌, రాజేంద్రప్రసాద్‌, ఆర్‌ఐ దామోదర్‌, శ్రీనివాస్‌, మల్లేశం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాముని గుండాలపై ధ్యానం

రామగుండం: రామునిగుండాల కొండపై వివి ధ విభాగాల డాక్టర్లు గురువారం సామూహిక సత్యశోధన (ప్రకృతి ధ్యానం) చేశారు. ఈ సందర్భంగా సైక్రియాట్రిస్ట్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ, సైన్స్‌ ఆఫ్‌ మెడిటేషన్‌ ద్వారా జ్ఞానం సిద్ధిస్తుందన్నారు. మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ధ్యాన సాధనలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

కంకణాల లొంగిపోవాలి

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): మారిన పరిస్థితు ల నేపథ్యంలో మావోయిస్టులు ఉద్యమాలంటూ ఉన్న ఊరు, కన్నతల్లిని వదిలి సాధించేదేమీలేదని ఏసీపీ కృష్ణ అన్నారు. మావోయిస్టు నేత కంకణాల రాజినెడ్డి తల్లి వీరమ్మను ఆయ న స్వగ్రామం కిష్టంపేటలో గురువారం ఏసీపీ పరామర్శించారు. బతుకమ్మ, దసరా సందర్భంగా కొత్త వస్త్రాలు, సామగ్రి, బియ్యం, మందులు అందజేసి మాట్లాడారు. కంకణాల రాజిరెడ్డి జీవన్రవంతిలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అశోక విజయదశమి వేడుకలు

గోదావరిఖనిటౌన్‌: జనగామలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అశోక విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి రోజు న కళింగ యుద్ధంలో ప్రత్యర్థి సైనికులు లక్షల్లో చనిపోయారని, అంతటి ప్రాణ నష్టాన్ని చూసి పశ్చాత్తాపపడిన అశోక చక్రవర్తి.. బౌద్ధ మతం స్వీకరించారని, ఈ సందర్భంగా అశోక విజయదశమి జరుపుకుంటారని పలువురు వక్తలు అన్నారు. అందుకే ఉపవాస దీక్షతో అహింస, కరుణ ఉత్సవంగా జరుపుకుంటారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ రిశ్విత్‌ మౌర్య, జనగామ స్వామి, మేకల శ్రీనివాస్‌, భీమ తిరుపతి, భరత్‌, శ్యామ్‌, రవీందర్‌, శోభారాణి, శ్రీలత, మధునయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

దుర్గామాత సన్నిధిలో పూజలు 
1
1/3

దుర్గామాత సన్నిధిలో పూజలు

దుర్గామాత సన్నిధిలో పూజలు 
2
2/3

దుర్గామాత సన్నిధిలో పూజలు

దుర్గామాత సన్నిధిలో పూజలు 
3
3/3

దుర్గామాత సన్నిధిలో పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement