
ఉత్తమ ర్యాంక్ సాధించడమే లక్ష్యం
● రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ ● ఉత్తమ కార్మికులకు సన్మానం
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్– 2025లో ఉత్తమ ర్యాంక్ సాధించడమే లక్ష్యమని నగరపాలక సంస్థ కమిసనర్ అరుణశ్రీ అన్నారు. 15 రోజులుగా కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పారిశుధ్య సిబ్బందిని బల్దియా కార్యాలయంలో గురువారం శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు ప్రదానం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన మార్కులు సాధించడానికి అవసరమైన అన్నిఅంశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని అన్నారు. సత్కారం అందుకున్న వారిలో డ్రెయిన్ క్లీనర్లు అవినాష్, రాజు, వెంకటేశ్, రమేశ్, సారయ్య, విశ్వనాథ్, నాయక్, మ ల్లేశ్, సదయ్య, కొమురయ్య, లింగమూర్తి, పోషౌ, కంపోస్ట్‌యార్డ్ ఆపరేటర్ ప్రకాశ్, జవాన్లు తిరుపతి, సారయ్య, దయానంద్, వెహికిల్ ఇన్‌చార్జి నరేశ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సంపత్, నాగభూషణం, పీఆర్వో కుమార్ ఉన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పాల్గొన్నారు.