
జిల్లా ఆస్పత్రిలో ప్రసవాలు భేష్
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గత సెప్టెంబర్ నెలలో రికార్డుస్థాయిలో 250 ప్రసవాలు జరిగాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యాధికారులను బుధవారం అభినందించారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో 503 ప్రసవాలు జరగ్గా, పెద్దపల్లి మాతాశిశు ఆస్పత్రిలోనే 250 జరిగాయన్నారు. గతంలో సగటు న నెలకు 130 ప్రసవాలు జరిగేవని పేర్కొన్నారు. చంటి పిల్లలకు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. గత సెప్టెంబర్‌లో 68 మందికి సేవలు అందించామని అన్నారు.
బాధ్యతలు స్వీకరణ
గ్రూప్ –1 ఆడిట్ అసిస్టెంట్ అఽధికారిగా ఎంపికై న అఖిల్‌రెడ్డి బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అఖిల్‌రెడ్డి.. గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో 176వ ర్యాంక్ సాధించారు. ఆయన కలెక్టర్ శ్రీహర్షను కలిశారు.
కానిస్టేబుల్ నుంచి ఎంపీడీవోగా..
గోదావరిఖనికి చెందిన చిప్పగణేశ్ 2020 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే గ్రూప్ –1 పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో 410వ ర్యాంక్ సాధించి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. పట్టుదలతో చదివి ఎంపికై న గణేశ్‌ను కలెక్టర్ బుధవారం తన కార్యాలయంలో అభినందించారు. అలాగే గ్రూప్ –2 ఫలితాల్లో ఏసీటీవోగా ఎంపికైన ఆర్ల సాగర్‌ను కూడా ఆయన అభినందించారు.