
ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు
కమాన్‌పూర్(మంథని): ప్రజలందరికీ దుర్గాదేవి అమ్మవారి అశ్సీలు ఉండాలని మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. దేవీశరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని దుర్గామాత సన్నిధిలో మంత్రి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మా జీ ఎంపీటీసీ పిల్లి శేఖర్‌ను మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్‌ఎస్ అన్వర్, ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావుల తదితరులు పాల్గొన్నారు.
దసరా ఏర్పాట్ల పరిశీలన
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో గురువారం జరిగే దసరా(షమీ) ఏర్పాట్లను పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, ఏసీపీ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ బుధవారం పరిశీలించారు. గురువారం సా యంత్రం నిర్వహించే షమీ (జమ్మి చెట్టు) పూ జా కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున హాజరవుతారని, ఇందుకోసం అన్నిఏర్పాట్లు పూర్తి చేశామని కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. అదేవిధంగా సాయంత్రం రాంలీలా (రావణవధ) వేడుకలను నిర్వహించనున్నట్లు మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ నూగిల్ల మల్లయ్య తెలిపారు.

ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు