
బిరుదు రాజమల్లు ఆశయ సాధనకు కృషి
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్(పెద్దపల్లి): మాజీఎమ్మె ల్యే బిరుదురాజమల్లు ఆశయ సా ధనకు అందరూ కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు కోరారు. బిరుదు రాజమల్లు జయంతి సందర్భంగా ఆ యన విగ్రహానికి ఎమ్మెల్యే బుధవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి బిరుదు రాజమల్లు నిరంతరం శ్రమించారన్నారు. కార్యక్రమంలో రాజమల్లు కుటుంబ సభ్యులు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయిబాబా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బిరుదు సమత, కృష్ణ, అనిల్, సంతోష్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.