
ఉత్సాహం నింపాలి
గోదావరిఖని: వి జయదశమి (దసరా) పండుగ ప్రజల్లో ఉత్సాహం, ఆ నందం నింపా లని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆకాంక్షించారు. విజయదశమితో కొత్తశకం ప్రారంభం కావాలన్నారు. రామగుండం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రాజీలేకుండా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
పకడ్బందీగా కోడ్ అమలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు.. ఇదేసమయంలో కోడ్ అమలు చేసేందుకూ చర్యలు తీసుకుంటున్నారు. తొలిదశలో పరిషత్, మలి దశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాలోని 13 జెడ్పీటీసీ, 13 ఎంపీపీతోపాటు 263 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వర కూ కోడ్ అమలులో ఉంటుందని అధి కారులు వివరిస్తున్నారు. తద్వారా సంక్షేమ, అభివృద్ధి పనులపై ఆంక్షలు కొనసాగుతాయని అంటున్నారు. మరోవైపు.. తగిన కారణాలు, అనుమతిలేకుండా రూ.50వేలకు మించి రవాణా చే యడం కుదరదని అధికారులు ఇప్పటి కే ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులూ ఏర్పాటు చేస్తున్నారు.