
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి:
జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్‌కు అధిక స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ మధుమిత పాల్గొని వినతులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్‌ఓ కె.నాగరాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శంకర కెరకెటా, తహసీల్దార్ నారాయణ బెహరా, సబ్ కలెక్టర్ అనుప్ పండా పాల్గొన్నారు. కెరండి, సిద్ధమణుగు, పర్లాకిమిడి పురపాలక, రాణిపేట గ్రామ పంచాయతీల నుంచి 57 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 37, గ్రామ సమస్యలకు సంబంధించినవి 21 ఉన్నాయి. వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
రాయగడలో..
రాయగడ: స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో సొమవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పాల్గొన్నారు. 55 వినతులను స్వీకరించారు. ఇందులో 47 వ్యక్తిగతమైనవి, మరో 8 గ్రామ సమస్యలుగా గుర్తించారు. ఏడుగురుకి ఆరోగ్య సమస్యలకు సంబంధించి రెడ్ క్రాస్ నిధుల నుంచి రూ. 25 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, డీఎఫ్‌ఓ అన్నా సాహెబ్ ఆహోలే, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, జిల్లా ముఖ్యవైధ్యాధికారి సరోజినిదేవి, తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ