
వన్యప్రాణులను కాపాడుకోవాలి
జిల్లా అటవీ శాఖ అధికారి అన్నా సాహేబ్ అహోలే
రాయగడ: వన్యప్రాణులు అంతరించి పోతున్నాయని వీటిని కాపాడుకోవడం మన కర్తవ్యమని జిల్లా అటవీ శాఖ అధికారి అన్నా సాహేబ్ అహోలే అన్నారు. జాతీయ వన్య ప్రాణుల వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అడవుల్లో ఉండే వన్యప్రాణుల జాతి అంతరించి పోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొంతమంది స్వార్ధపరులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వన్యప్రాణులను వేటాడి హతమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అడవుల్లోని పచ్చని చెట్లు నరికి వేస్తుండటంతో వన్యప్రాణులు జనార్యంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు. వన్యప్రాణుల సంరక్షణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ అశోక్ కుమార్ ప్రధాన్ అన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల ఽమధ్య పోటీలను నిర్వహించారు.
విజేతల వివరాలు
జలచర ప్రాణులకు సంబంధించి నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో సీనియర్ విభాగంలో తపస్విని కడ్రక ప్రథమ బహుమతిని గెలుచుకోగా సామిరాణి గౌడో ద్వితీయ, పొరిస్మిత బిడిక తృతీయ బహుమతులను గెలుపొందారు. జూనియర్ విభాగంలో స్మృతి బెహర, బిందీయ సబర్, అభ్యాస్ ప్రధాన్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు అటవీ శాఖ అధికారి అహోలే బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రాయగడ రేంజర్ కామేశ్వర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.