పరారైన ఖైదీలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం | - | Sakshi
Sakshi News home page

పరారైన ఖైదీలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం

Oct 6 2025 2:00 AM | Updated on Oct 6 2025 2:00 AM

పరారై

పరారైన ఖైదీలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం

భువనేశ్వర్‌: కటక్‌ జిల్లా చౌద్వార్‌ సర్కిల్‌ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోయిన విషయం తెలిసిందే. వీరివురి ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం రూ. 50 వేల నగదు పురస్కారం ప్రకటించింది. శుక్రవారం చౌద్వార్‌ జైలు ప్రహరీ దూకి పారిపోయిన ఇద్దరు ఖైదీల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన అనుభవజ్ఞులైన అధికారులను ఈ బృందంలోకి తీసుకున్నారు. చౌద్వార్‌ జైలు రోడ్డు నుంచి చరబటియా వరకు దారి పొడవునా ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. చరబటియా, నెర్గుండి, టంగి మరియు కటక్‌ నగరంలోని రైల్వే స్టేషన్లలో పోలీసులు భద్రతను పెంచారు. పారిపోయిన ఖైదీలను పట్టుకోవడానికి ఈ ప్రదేశాలలో రాత్రిపూట తనిఖీలు కొనసాగిస్తున్నారు.

చెరువులో మునిగి ఏడేళ్ల బాలుడు మృతి

మల్కన్‌గిరి: చెరువులో మునిగి ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి వెంకటపాలెం పంచాయతీ యం.వి.74 గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబులి డాంగీ కుమారుడు ఆయుష్‌ డాంగీ (7) తోటి పిల్లలతో ఆడుకుంటూ చెరువు వైపు వెళ్లి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. దీంతో వెంట ఉన్న పిల్లల కేకలు విన్న స్థానికులు వచ్చి ఆయుష్‌ డాంగీని బయటకుతీసి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్టు నిర్ధారించారు. విషయం తెలిసిన పోలీసు ఐఐసీ ముకుందో మేళ్క ఆరోగ్య కేంద్రానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహేన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

చెరువులో పడి ఒక వ్యక్తి గల్లంతు

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ కొట్‌పాడ్‌ సమితి గువులి గ్రామంలోని చెరువులో పడి ఒక వ్యక్తి గల్లంతు అయ్యాడు. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన చూసిన వారు వెంటనే కొట్‌పాడ్‌ అగ్ని మాపక విభాగ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చెరువులో గల్లంతయిన వ్యక్తి కోసం గాలించారు. గల్లంతయిన వ్యక్తి కొట్‌పాడ్‌ సమితి అసన గ్రామానికి చెందిన కెమెరాజ్‌ పూజారిగా స్థానికులు అనుమానిస్తున్నారు.

నాలుగు కాళ్ల కోడి

జయపురం: బొరిగుమ్మ సమితి కొశాగుడ గ్రామంలో గల మెగా ఫౌల్ట్రిలో ఒక కోళ్ల ఫారంలో ఒక కోడికి నాలుగు కాళ్లు కనిపించాయి. నాలుగు దినాల కిందట చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కోళ్ల లోడు కొశాగుడలో కోళ్ల ఫారానికి వచ్చింది. కోళ్లు అన్‌లోడ్‌ అయి ట్రక్కు వెళ్లిపోయింది. కోళ్లు అమ్ముతున్న సమయంలో వాటిలో ఒక కోడికి నాలుగు కాళ్లు ఉండటం కనిపించింది. రెండు సాధారణ కాళ్లతో పాటు చిన్నగా మరో రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో ఈ కోడిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

రద్దు చేసిన పరీక్షల నివేదికను సమర్పించాలి

భువనేశ్వర్‌: రద్దు చేసిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల సమగ్ర వివరాలతో నివేదిక దాఖలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాత పరీక్ష రద్దు నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. భారీ స్థాయిలో మోసం చోటు చేసుకోవడంతో రద్దు అనివార్యం అయినట్లు తేటతెల్లం అయింది. ఇటీవల కాలంలో తరచూ ఉద్యోగ నియామకాల పరీక్షలు రద్దు అవుతున్నట్లు విపక్షం ప్రభుత్వంపై వేలెత్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వ అన్ని నియామక బోర్డులు, కమిషన్లు రద్దు చేసిన పరీక్షల నివేదికను సమర్పించాలని ఆదేశించారు. గత ఏడాది (2024) జూన్‌ నుంచి నేటి వరకు రద్దు చేయబడిన ఉద్యోగ నియామకాల పరీక్ష నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు. తక్షణమే ఈ నివేదికను సిద్ధం చేసి ఈ–మెయిల్‌ చేయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

పరారైన ఖైదీలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం 1
1/1

పరారైన ఖైదీలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement