
ట్రక్‌ను ఢీకొన్న బైక్‌లు.. ముగ్గురు మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి కోత్తమిట పంచాయతీ తంగగూఢ గ్రామం వద్ద శనివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్‌ను రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్ బ్రేక్‌డౌన్ కావడంతో రహదారి ఒడ్డున నిలిచిపోయింది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో వర్షం పడుతుండగా బైక్ వచ్చి ట్రక్‌ను ఢీకొంది. స్థానికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఒకరు మృతి చెందారు. మరికొంత సమయానికి మరో బైక్‌పై మల్కన్‌గిరి సమితి సింద్రీమాల గ్రామానికి చేందిన భీమ్ ఖీలో, సుక ఖీలో వస్తూ ట్రక్‌ను ఢీకొన్నారు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆదివారం భీమ్ ఖీలో మృతదేహంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్ కీండో సంఘటన స్థలానికి వెళ్లి గ్రామస్తులతో చర్చించారు. ట్రక్‌ను తొలగించకపోవడం వల్లనే ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఐఐసీ మాట్లాడుతూ ట్రక్‌లో ఇనుప సామాన్లు ఉండడం వల్ల తొలగించడం కష్టమైందని తెలిపారు. మృతదేహాలను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ట్రక్‌ను ఢీకొన్న బైక్‌లు.. ముగ్గురు మృతి

ట్రక్‌ను ఢీకొన్న బైక్‌లు.. ముగ్గురు మృతి