దుర్గా పూజ ప్రభలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహం: ముఖ్యమంత్రి | - | Sakshi
Sakshi News home page

దుర్గా పూజ ప్రభలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహం: ముఖ్యమంత్రి

Oct 6 2025 2:00 AM | Updated on Oct 6 2025 2:00 AM

దుర్గా పూజ ప్రభలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహం: ముఖ్యమంత

దుర్గా పూజ ప్రభలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహం: ముఖ్యమంత

భువనేశ్వర్‌: దసరా సందర్భంగా దుర్గా పూజా మండపాల్లో ధగేలుమనిపించే ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా కటక్‌ మహా నగరం దీనికి ప్రసిద్ధి చెందింది. బంగారం, వెండి వంటి విలువైన హంగులతో దుర్గా మాతకు అలంకరణలో ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. ఈ రంగంలో కటక్‌ మహా నగరం శతాబ్దాల చరిత్ర మూటగట్టుకుంది. ఆయా నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆమోదం మేరకు సమగ్రంగా 1,085 దుర్గా ప్రభలకు ఆర్థిక సహాయం అందజేసేందుకు ఖరారు చేశారు. దీని వ్యయ ప్రణాళిక రూ. 7 కోట్ల 1 లక్ష 40 వేల రూపాలుగా ప్రకటించారు. దుర్గా మండపాలపై శోభిల్లే ప్రభల్ని 3 వర్గాలుగా విభజించి ఈ ఆర్థిక సహాయం అందజేస్తారు. చారిత్రాత్మక వారసత్వం, 75 ఏళ్ల పైబడిన చరిత్ర, 50 ఏళ్లు పైబడి నిరవధికంగా కొనసాగుతున్న ప్రభల అలంకరణ పూజా మండపాలుగా విభజించారు. చారిత్రాత్మక వారసత్వం కలిగిన 215 ప్రభలకు 2 కోట్ల 17 లక్షల రూపాయలు, 75 ఏళ్ల చరిత్ర కలిగిన 197 ప్రభలకు 1 కోటి 47 లక్షల రూపాయలు, 50 ఏళ్లు పైబడిన 673 ప్రభలకు 3 కోట్ల 36 లక్షల రూపాయలు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement