స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ

Oct 5 2025 2:12 AM | Updated on Oct 5 2025 2:12 AM

స్కూల

స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ

షెడ్యూల్‌ ప్రకారం హాజరుకావాలి.. సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీకాకుళం న్యూకాలనీ: మలివిడత స్కూల్‌గేమ్స్‌ ఎంపిక పోటీలకు రంగం సిద్ధమైంది. జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిద క్రీడాంశాల్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే సాఫ్ట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, ఉషూ, బాక్సింగ్‌ నాలుగు క్రీడాంశాల్లో ఎంపికలు ముగియగా.. మిగిలిన క్రీడాంశాలకు ఎంపిక పోటీలను పాఠశాలలకు ముందస్తు దసరా సెలవును ప్రకటించడంతో వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో కొన్ని మినహా మెజారిటీ సెలక్షన్స్‌ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే జరగనున్నాయి. ఐదు రోజులపాటు నిర్దేశిత షెడ్యూల్‌ను జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, డీఈఓ ఎ.రవిబాబు, కార్యదర్శి బీవీ రమణ సంయుక్తంగా వెల్లడించారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.తవిటయ్య, మొజ్జాడ వెంకటరమణ పిలుపునిచ్చారు,

ఐదు రోజుల షెడ్యూల్‌ ఇది..

తొలిరోజు 5న: హాకీ (శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజ్‌), వెయిట్‌లిఫ్టింగ్‌ (పెద్దపాడు), రెజ్లింగ్‌ (పెద్దపాడు), ఆర్చరీ (రాజ్‌కుమార్‌ అకాడమీ శ్రీకాకుళం), రగ్బీ, నెట్‌బాల్‌, రోప్‌ స్కిప్పింగ్‌, షూటింగ్‌బాల్‌ (టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం), టేబుల్‌టెన్నిస్‌ (శాంతినగర్‌కాలనీలో డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియం), యోగా (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సత్యవరం, నరసన్నపేట మండలం), లాన్‌టెన్నిస్‌ (శ్రీకాకుళం ఆర్ట్స్‌కాలేజ్‌ టెన్నీస్‌ అకాడమీ). కరాటే (శ్రీకాకుళం మహాలక్ష్మినగర్‌కాలనీలోని శ్రీచైతన్య స్కూల్‌).

6న: అథ్లెటిక్స్‌ (కోడిరామ్మూర్తి స్టేడియం శ్రీకాకుళం), త్రోబాల్‌ (శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజ్‌), అండర్‌–14, 17 చెస్‌ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎచ్చెర్ల).

7న: కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌ బాడ్మింటన్‌ బాలురుకు మాత్రమే (శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజ్‌ మైదానం), క్రికెట్‌ (ఆర్ట్స్‌కాలేజ్‌), బాల్‌బాడ్మింటన్‌ (ఆర్ట్స్‌కాలేజ్‌), అండర్‌–19 చెస్‌ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎచ్చెర్ల).

8: కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ బాలికలకు మాత్రమే (శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజ్‌ మైదానం), స్విమ్మింగ్‌ (శాంతినగర్‌కాలనీలో డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ ఫూల్‌), తైక్వాండో, ఫెన్సింగ్‌ (శ్రీకాకుళం టౌన్‌ హాల్‌), బాస్కెట్‌బాల్‌, సెపక్‌తక్ర (ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానం శ్రీకాకుళం), బేస్‌బాల్‌ (కేఆర్‌ స్టేడియం శ్రీకాకుళం)

9: హ్యాండ్‌బాల్‌ (జెడ్పీహెచ్‌ స్కూల్‌ తొగరాం, ఆమదాలవలస మండలం).

జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్‌ ఎంపిక పోటీలకు సంబంధించి మలివిడత షెడ్యూల్‌ను ప్రకటించాం. అండర్‌–14,17,19 విభాగాల్లో బాలబాలికలకు నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం నిర్దేశించిన మైదానంలో ఉదయం 9 గంటలకు రిపోర్ట్‌ చేయాలి. అవసరమైన ధ్రువపత్రాలు తీసుకురావాలి.

– బడి వెంకటరమణ, ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రటరీ

స్కూల్‌గేమ్స్‌ అనేవి విద్యార్థులకు వరమనే చెప్పాలి. క్రీడాకారులు గుర్తింపు పొందేది, తయార్యేది స్కూల్‌గేమ్స్‌ నుంచే. ఎంపికల్లో ప్రతిభ కనబర్చి జిల్లా జట్లకు ఎంపికయితే రాష్ట్రపోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలబాలికలంతా సద్వినియోగం చేసుకోవాలి.

– మొజ్జాడ వెంకటరమణ,

జిల్లా పీడీ–పీఈటీ సంఘ ప్రధాన కార్యదర్శి

నేటి నుంచి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు మొదలు

ఐదు రోజుల పాటు వివిధ విభాగాల్లో నిర్వహణ

ఏర్పాట్లు పూర్తిచేసిన స్కూల్‌గేమ్స్‌

ఫెడరేషన్‌ అధికారులు

స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ 1
1/3

స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ

స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ 2
2/3

స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ

స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ 3
3/3

స్కూల్‌గేమ్స్‌.. మలివిడత పోరుకు రెఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement