గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Oct 5 2025 2:12 AM | Updated on Oct 5 2025 2:12 AM

గుర్త

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి పాంగాం పంచాయతీ పెద్దగూఢ గ్రామం క్రాస్‌ వద్ద చెరువులో తేలియాడుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం ుధయం గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వారికి మృతదేహం కనిపించడంతో మాత్తిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ దీపాంజాలి ప్రధాన్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మల్కన్‌గిరి అగ్నిమాపిక కేంద్రం సిబ్బంది సాయంతో మృతదేహన్ని బయటకు తీశారు. అయితే స్థానికులు ఏవరు కూడా మృతదేహాన్ని గురించలేదు. మృతదేహన్ని 72 గంటలు తమ సమక్షంలో ఉంచిన తరువాత ఎవరూ రాకపోతే తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుత్తం మృతదేహన్ని మత్తిలి ఆరోగ్య కేంద్రంలోని మార్చురీలో ఉంచారు.

కారు,బైక్‌ ఢీకొని నలుగురికి గాయాలు

మల్కన్‌గిరి: కారు, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ సఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి.31 గ్రామం వద్ద రోజు శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తితోపాటు కారులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కలిమెల ఆరోగ్య కేంద్రానికి స్థానికులు తరలించారు. అయితే క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదసి చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఐఐసీ ముకుందో మేళ్క తెలిపారు.

వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్‌.పురం పాత పోలీస్‌స్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలో కంపోస్టు కాలనీకి చెందిన బరాటం ప్రసాదరావు (68) రణస్థలం మండలంలోని కోష్టలో పాన్‌షాప్‌ నడుపుతూ అక్కడే నివాసముంటున్న కుమారుడు శ్రీనివాసరావు వద్దకు బయలుదేరాడు. శనివారం ఉదయం రణస్థలంలో దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికులు స్పందించి 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సోషల్‌ మీడియాలో ఫొటో చూసి కుమారుడు, బంధువులు గుర్తుపట్టి రిమ్స్‌కు చేరుకున్నారు. కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్‌.పురం ఎస్సై ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం రూరల్‌: ఇప్పిలి గ్రామానికి చెందిన ఇప్పిలి ఈశ్వరరావు (48) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల సత్యనారాయణ ప్రవర్తనలో తేడా రావడంతో కుమార్తె, కుమారుడు నిలదీశారు. కోపోద్రుక్తుడైనా ఈశ్వరరావు పంట పొలాలకు కొట్టే పురుగుల మందును శుక్రవారం తాగాడు. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే శ్రీకాకుళం నగరంలోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతదేహన్ని రిమ్స్‌కు తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయితో వ్యక్తి అరెస్టు

టెక్కలి రూరల్‌: టెక్కలి రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు టెక్కలి ఎస్‌ఐ రాము తెలిపారు. బీహార్‌కు చెందిన ఎండీ స్వామన్‌ 640 గ్రాము ల గంజాయి తీసుకుని ట్రైన్‌లో టెక్కలి వచ్చి అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అదుపులో తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

హిజ్రాల దారిదోపిడీ

నరసన్నపేట: ఉర్లాం–నడగాం మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కొందరు హిజ్రాలు కారులో వచ్చి దారిదోపిడీకి పాల్పడ్డారు. నడగాంకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ దొంపాక ఆనంద రమణ మెడలో బంగారు చైన్‌ను లాక్కొని ఉడాయించారు. ఉర్లాం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నడగాం రైల్వేగేటు దాటిన తర్వాత రోడ్డుపై కాచి ఉన్న ఐదుగురు హిజ్రాలు వాహనాన్ని ఆపి డబ్బులు అడిగారని ఆనంద రమణ తెలిపారు. ఇవ్వకపోవడంతో మెడలో తులంన్నర బంగారు చైన్‌ లాక్కెళ్లిపోయారని, ఈ మేరకు నరసన్నపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

గుర్తు తెలియని  వ్యక్తి మృతదేహం లభ్యం1
1/1

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement