
సొంతగూటికి అంతర్యామి గోమాంగో
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మాజీ చైర్మన్, స్పెషల్ ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ అంతర్యామి గోమాంగో శనివారం బరంపురం ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఆయన తొలుత బీజేపీలో అనేక ఏళ్లు పనిచేసి రాయఘడ బ్లాక్ చైర్మన్‌గా గెలుపొందారు. తర్వాత బీజేపీ చేరి ఆయన భార్య పూర్ణబాసి నాయక్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో మోహనా ఎస్టీ నియోజక వర్గం నుంచి బీజేడీ నుండి పోటీ చేయించారు. అయితే గత 2024 ఎన్నికల్లో పూర్ణబాసి నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి దాశరథి గోమాంగో చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత ఆమె రాయఘడ బ్లాక్‌చైర్మన్‌గా గెలుపొందారు. అంతర్యామి గోమాంగో తిరిగి బీజేపీలో చేరడంతో పార్టీలో కొంతమందికి మింగుడు పడటం లేదు. అంతర్యామి గోమాంగో బీజేపీలోకి రాకుండా ఆయనకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి లేఖలు రాశారు. అయితే ఆయనకు రాష్ట్ర మంత్రి బిభూతీ జన్నా, బరంపురం ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన తిరిగి సొంతగూటికి చేరడం సులువైంది.